రామాయణం సుందరకాండ – 2
Login to Play your Story!
హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడు
హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడు
హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.
సంపాతి అలా వానరులకు సాయం చేయగానే నిసకారమహర్షి చెప్పిన విధంగా అతనికి రెక్కలు మొలిచాయి. జాంబవతాదులకు కూడా విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ వనరులకు లంకకు మధ్య ఉన్న అంతులేని సముద్రం చూసి దిగులు చెందారు. అందరూ హనుమను ప్రేరేపించగా మహేంద్రగిరిపై నించి లంక వైపు దూకడానికి సిద్దమవ్వగా ఈ కిష్కిందకాండ ముగిసింది.
అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వింధ్య పర్వతం పైన సీత దొరకలేదని విచారంతో, గడువు దాటిపోయిందని భయంతో ప్రాయోపవేశం చేసుకుందామని సిద్ధపడ్డారు. ఇంతలో సంపాతి అనే ఒక మహాపక్షి వారి కంట పడింది. సంపాతి జటాయు అన్న అని తెలుసుకుని జరిగినదంతా చెప్పగా, సంపాతి సీతని ఎవరు ఎత్తికెళ్లింది దివ్య దృష్టితో చూసి చెప్పేసాడు.
సుగ్రీవుడు వనరులందరికి పదిహేను రోజుల్లో కిష్కిందకి రావాలని ఆదేశాన్ని ఇచ్చాడు. లక్షల కోట్ల సంఖ్యలో రకరకాల వానరులు కిష్కింధకు చేరాయి. సుగ్రీవుడు నలుదిక్కుల వారిని పంపి సీతాకోసం వెతకమన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు వెళ్లిన వానరులంతా సీత దొరకలేదని తిరిగివచ్చారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులు దక్షిణం వైపు వెళ్లారు. 6 నెలలు గడిచినా కానీ వారికి సీత జాడ తెలియలేదు.